- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు పుట్టపర్తిలో ప్రధాని మోడీ పర్యటన
ఇవాళ పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇక ఈ తరుణంలోనే బాబా మందిరం, మహా సమాధిని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శిస్తారు. అనంతరం బాబా స్మారక నాణెం, స్టాంపులను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు.






