- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2న రాష్ట్రానికి ప్రధాని మోడీ.. 6 వేల మంది పోలీసులతో భద్రత
మే 2న ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు..

దిశ, వెబ్ డెస్క్: మే 2న ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పున: ప్రారంభం(Amaravati construction resumes) కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే పలు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 6 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ(Pm Modi) మే2న తిరుమనంతపురం నుంచి తొలుత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి హెలిప్యాడ్‌లో వెళ్తారు. ఆ తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పున: ప్రారంభ వేదిక వద్దకు చేరుకుంటారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు.
ఈ సభకు 100 మంది వీవీఐపీలు, 15 మంది ఎంపీలు, 5 వేల మంది వీఐపీలతో పాటు ప్రజలకు సైతం భారీగా రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రత చర్యలు చేపటుతోంది. మరోవైపు ప్రధాని భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి అనిత(Home Minister Anitha)తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు.






