- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ పర్యటన ఎఫెక్ట్.. చేపలవేటపై కీలక ఆదేశాలు
విశాఖలో నిర్వహించే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో నిర్వహించే యోగా డే(Yoga Day) కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ మేరకు అధికార యంత్రాగం ఏయూతో పాటు ఆర్కేబీచ్‌లో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్(RK Beach)లో ప్రధాని మోడీ(Prime Minister Modi) వేదిక ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏయూలో ఏర్పాటు చేస్తున్న వేదిక ద్వారా 25 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్యనమస్కారాలు చేయనున్నారు. మంత్రుల టీమ్ విశాఖలోనే మకాం వేసి ‘యోగా డే’ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ పర్యటన, యోగా డే నిర్వహణ నేపథ్యంలో విశాఖలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సముద్రంలో చేపల వేటపై రెండు రోజుల పాటు నిషేధం విధించారు. ఈ నెల 20, 21న మత్య్సకారులెవరూ సముద్రంలోకి చేపల కోసం వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపలవేటపై ఆంక్షలు విధించారు. 22 నుంచి యథావిధిగా చేపలవేట కొనసాగించుకోవచ్చని సూచించారు. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనని హెచ్చరించారు.






