ఏపీకి ప్రధాని మోడీ.. ఈసారి ఎందుకో తెలుసా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-15 04:21:08  IST  )

ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోడీ త్వరలో రానున్నారు. ..

ఏపీకి ప్రధాని మోడీ.. ఈసారి ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ప్రధాని మోడీ(Pm Modi) త్వరలో రానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు(International Yoga Day celebrations) ఈసారి రాష్ట్రం వేదికకానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు ఈ నెల 2న జరిగిన ఏపీ పర్యటనలో ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీనే వెల్లడించారు. దీంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ(Visakha)లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. యోగాంధ్ర-2025(YogaAndhra-2025) నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 29 నుంచి 4 వారాల పాటు నాలుగు అంచెల ప్రచార కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

జూన్ 5 నుంచి వారం పాటు జిల్లాలు, జూన్ 12 నుంచి గ్రామాలు, 17 నుంచి విద్యాసంస్థల్లోనూ యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. యోగా దినోత్సవంలో ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్‌లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సైతం భాగస్వాయులు కానున్నారు. రెండు లక్షల టీ షర్టులు, యోగా మ్యాట్లను కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి. మోడీ పర్యటన నేపథ్యంలో అటు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

Next Story