కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని అభినందించిన ప్రధాని

by Thanuru Gopichand |

ఇండిగో (Indigo) విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (kinjarapu Rammohan Naidu) సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని అభినందించిన ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండిగో (Indigo) విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (kinjarapu Rammohan Naidu) సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇండిగో సమస్యపై రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు ఇచ్చిన వివరణపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మేలు జరిగేలా, కఠినమైన 'సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్' (CARs) పాటించేలా మంత్రి చర్యలు తీసుకున్నారని మోదీ కితాబునిచ్చారు. ఈ క్లిష్ట సమయంలో మంత్రి పనితీరు పట్ల ప్రధాని మోదీ పూర్తి మద్దతు ప్రకటించారు. విమర్శలను పట్టించుకోవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని రామ్మోహన్ నాయుడుకి ప్రధాని మోదీ సూచించారు. కాగా, ఇండిగో సంక్షోభానికి సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళికల్లో లోపాలే కారణమని మంత్రి రాజ్యసభలో స్పష్టం చేస్తూ, ప్రయాణికుల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.

Next Story