- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి బంగారు డాలర్లపై ధరల ప్రభావం
విక్రయాలకు నూతన విధానం రూపొందించిన ఆలోచనలో టీటీడీ అధికారులు.

దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలంగా బంగారం ధర (Gold Price) ఆకాశాన్ని అంటుతోంది. రెండు రోజుల నుంచి కొంత తగ్గు ముఖం పట్టింది. అయితే బంగారం ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం తిరుమల శ్రీవారి డాలర్లపై (Tirumala Srivari Dollar) పడింది. బహిరంగ మార్కెట్ లో బంగారం అధిక ధర పలుకుతోంది. అయినప్పటికీ శ్రీవారి డాలర్లను నిబంధనల ప్రకారం టీటీడీ (TTD) విక్రయిస్తోంది. దీంతో ఒక్కసారిగా బంగారు డాలర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. నిబంధనల ప్రకారం వారానికి ఒకసారి శ్రీవారి బంగారు డాలర్ ధరను టీటీడీ సవరిస్తూ ఉంటుంది.
బయటి మార్కెట్ ధరతో పోలిస్తే టీటీడీ విక్రయించే డాలర్ల ధర తక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వల్ల టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి బంగారు డాలర్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్తులో ఈ నష్టాలను నివారించేందుకు, విక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు టీటీడీ నూతన విధానాలను (New Policy) రూపొందిస్తోంది. ఇకపై వారానికి ఒకసారి కాకుండా, బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా రోజువారీ ధరలను (Daily Pricing) ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాకుండా కేవలం శ్రీవారి దర్శన టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే, అది కూడా ఒకరికి ఒకటి మాత్రమే విక్రయించేలా నిబంధనలను కఠినతరం చేయాలని యోచిస్తోంది. రూ.50 వేలకు మించి కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాతే విక్రయాలు పునఃప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.






