- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ప్రెస్టీజ్, ANSR పెట్టుబడులు : మంత్రి నారా లోకేష్
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ బెంగుళూరులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రెస్టీజ్, ANSR కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రెస్టేజ్ గ్రూప్ ప్రతినిధులను విజ్ఞప్తి చేశారు. ప్రెస్టేజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జాయాద్ నోమాన్ లతో జరిగిన సమావేశంలో.. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని, సుమారు రూ.65వేల కోట్లతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఐటి హబ్ గా మారుతోందని అన్నారు. అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన ఏపీ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ప్లగ్ అండ్ ప్లే మోడల్ ప్రిబిల్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని నారా లోకేష్ కోరారు.
అదేవిధంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ANSR సంస్థ విశాఖపట్నంలో GCCs కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించడానికి ఏపీ ప్రభుత్వంతో నా సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. మధురవాడ IT క్లస్టర్‌లో అత్యాధునిక GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ANSR సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. కాగా ఈ క్యాంపస్ ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో 10వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించనుందని, ఏపీలోని అత్యుత్తమ ప్రతిభ గల పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో ప్రపంచస్థాయి సంస్థలకు ANSR మద్దతునిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.






