- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం.. పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను..

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం.. పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆమె సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారు. ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్ లు ఘన స్వాగతం పలికారు.
మహాసమాధి దర్శనానంతరం హిల్ వ్యూ స్టేడియంకు చేరుకున్న రాష్ట్రపతి.. సత్యసాయిబాబా విశిష్ఠత గురించి తెలిపారు. ఆయన బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపించాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్లాదిమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆయన శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
Next Story






