- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేగం పుంజుకున్న మెట్రో.... రంగంలోకి వివిధ ఆర్థిక సంస్థలు..!
విశాఖ మెట్రో పనుల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విభజన సమయంలో విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు అటు మోడీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014-19 చంద్రబాబు హయాంలో కొంతమేర అడుగులు పడ్డాయి. ఆ తర్వాత అధికారం మారడంతో మెట్రో అంశం అప్పుడప్పుడు చర్చకు వచ్చేది. అలా కాలం గడిచిపోయింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెట్రోకు మళ్లీ కొత్త ఊపు వచ్చింది. పెరుగుతున్న జనాభా, ప్రయాణాలు, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని విజయవాడ, విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భూ నిర్వాసితులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం విశాఖ తొలుత దశ మెట్రోకు పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం జనరల్ కన్సల్టెన్సీని నియమించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మెట్రో ప్రాజెక్టుకు పునాది రాయి వేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా తొలి దశలో రూ. 11,498 కోట్ల అంచనాల వ్యయంతో మొత్తం 46.23 కిలో మీటర్ల పొడవునా మూడు ప్రధాన కారిడార్లలో 42 స్టేషన్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మడి జంక్షన్ వరకూ సుమారు 34.40 కిలో మీటర్ల మొత్తం 29 స్టేషన్లు, అలాగే గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకూ 5.07 కి.మీ మేర 6 స్టేషన్లు, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్ట్రైర్ 6.75 కిలో మీటర్లు 7 స్టేషన్లు ఇలా మూడు కారిడార్లగా మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం భూసేకరణ పనుల్లో వేగం పెంచారు.ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. అలాగే ప్రాజెక్టు అవసరాలను తీర్చడానికి వివిధ ఆర్థిక సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆర్థిక సంస్థలతో చర్చలు సఫలం అయి మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభమై వేగంగా పూర్తి అవుతుందేమో చూడాలి.






