ప్రకాష్ రాజ్ కు చిలిపి సందేహం.. ఏంటంటే?

by Thanuru Gopichand |   (  Updated:2025-08-22 06:09:39  IST  )

జస్ట్​ ఆస్కింగ్​ అంటూ ట్విట్టర్​లో యాక్టివ్​గా ఉండే యాక్టర్ ప్రకాష్​రాజ్​కు ఓ చిలిపి సందేహం వచ్చింది.

ప్రకాష్ రాజ్ కు చిలిపి సందేహం.. ఏంటంటే?
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : జస్ట్​ఆస్కింగ్​అంటూ ట్విట్టర్​లో యాక్టివ్​గా ఉండే యాక్టర్ ప్రకాష్​రాజ్​కు ఓ చిలిపి సందేహం వచ్చింది. ఈ రోజు ఆయన ఒక ట్వీట్​చేశారు. ‘ఒక చిలిపి సందేహం.. మహాప్రభు.. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక, మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ???’ అంటూ ఆయన ఆ ట్వీట్​లో ప్రశ్నించారు. దేశ రాజకీయాలపై సునిశిత విమర్శలు చూస్తూ తరచూ ప్రకాష్​రాజ్​వార్తల్లో ఉంటారు. ఎక్కువగా ఎన్డీయే తీసుకునే నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తుంటారు. నూతనంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుపై ఆయన సహజంగానే స్పందించారు. అయితే ఈ ట్వీట్​లో ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అంటూ ప్రస్తుతించారు. ఆ ఇద్దరు ఎవరు.. ఏ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది. మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా.. అని ఆయన పేర్కొనడం.. అది ఏపీ రాజకీయాలకు సంబంధించినదే అయి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పరోక్షంగా పవన్ కల్యాణ్ ని అన్నట్లు ఉందని నెటిజన్లు అంటున్నారు.

https://x.com/prakashraaj/status/1958738646154322024

Next Story