- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం.. హత్యా.. ఆత్మహత్యా..?
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లాలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కలకలం రేగింది..

X
దిశ, వెబ్ డెస్క్: మహిళ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తిగా కాలిపోయిన స్థితితో ఉన్న మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్యూస్ టీమ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లిలో జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన ప్రేమమ్మ(53) మృతి చెందారు. నిన్న, మొన్నటి వరకూ బాగానే ఉన్నారు. అయితే పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో ఆత్మహత్యా, హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని తెలిపారు. ప్రేమమ్మ మృతిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని స్థానికులకు పోలీసులు సూచించారు.
Next Story






