- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: మంత్రిగారు.. మంచి నీళ్లు లేవు
పుల్లలచెరువు మండలం సి కొత్తపల్లిలో వారం రోజులుగా మంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు...

X
దిశ, ఎర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం సి.కొత్తపల్లిలో వారం రోజులుగా మంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని మంచినీళ్ళ ట్యాంకర్లు, ట్రాక్టర్ల యజమానులు మంచి నీళ్లు సరఫరా చేయడం నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు, మహిళలు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా మంచినీళ్లు దొరకడం లేదని.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. దాహంతో పశువులు చనిపోతుంటే పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. మంచినీటి సమస్య తీరుస్తానని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓట్లు వేయించుకున్నారని.. తీరా గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి సురేశ్ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు
Next Story






