- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Polluted Water: ఏకలవ్య మోడల్ స్కూల్‌లో 30 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం పంచాయతీలోని ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ కాలేజ్‌లో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..

X
దిశా ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురం ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ కాలేజ్‌లో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత మంచినీళ్లు తాగడంతో విద్యార్థులకు వాంతులు, విరోచనాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో విద్యార్థులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్కూల్ మంచి నీళ్ల ట్యాంకులో ఎక్కువ మోతాదులో క్లోరిన్ పౌడర్ కలపడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. స్కూలులో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మిగిలిన విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించారు.
Next Story






