పల్నాడులో జంట హత్యలు.. ప్రభుత్వం సీరియస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-24 16:29:21  IST  )

పల్నాడులో జంట హత్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది...

పల్నాడులో జంట హత్యలు.. ప్రభుత్వం సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై వెళ్తున్న వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును స్కార్ఫియో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. గ్రామంలో ఉన్న ఆదిపత్య కారణాలే ఈ హత్యకు కారణమని తేలింది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సిరీయస్ అయింది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, జిల్లా ఎస్పీతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు దారుణ హత్యకు గురవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఈ జంట హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. హత్యారాజకీయాలను ప్రోత్సహించే వారిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. ప్రత్యర్థుల అమానుష దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరపున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.

Next Story