- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరాలలో గుర్తు తెలియని యువకుడి హత్య..!
ఓ గుర్తు తెలియని యువకుడు హత్యకు గురైన సంఘటన బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల పట్టణంలో చోటు చేసుకుంది.

దిశ ప్రతినిధి, బాపట్ల : ఓ గుర్తు తెలియని యువకుడు హత్యకు గురైన సంఘటన బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీరాల పట్టణంలోని ఆర్ఓబీ కింద గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉంది. వేకువజామున అది గమనించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చీరాల ఒకటో పట్టణ సీఐ సుబ్బరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృత దేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. అయితే మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య జరిగినట్లుగా భావిస్తున్న ప్రాంతం సమీపంలోనే మద్యం షాపు ఉండడం కూలా పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మృత దేహం రైల్వే పట్టాల సమీపంలో ఉంది. దీంతో కేసు రైల్వే పోలీసులు చేపడతారా, సివిల్ పోలీసులు దర్యాప్తు చేస్తారా అనే స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.






