ఇసుక దోపిడీ కోస‌మే గుండ్లకమ్మ గేట్లు విర‌గ్గొట్టారు: వైసీపీ నేతలపై మంత్రి ఫైర్

by Vemula.Srinu Prasad |

వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో ఇసుక దోపిడీ కోస‌మే గుండ్లక‌మ్మ ప్రాజెక్ట్ గేట్లను విర‌గ్గొట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక దోపిడీ కోస‌మే గుండ్లకమ్మ గేట్లు విర‌గ్గొట్టారు: వైసీపీ నేతలపై మంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో ఇసుక దోపిడీ కోస‌మే గుండ్లక‌మ్మ ప్రాజెక్ట్(Gundlakamma Project) గేట్లను విర‌గ్గొట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో పర్యటించిన ఆయన గుండ్లక‌మ్మ నుంచి వైసీపీ నేత‌లు(YCP leaders) కోట్లాది రూపాయల విలువైన ఇసుకను దోపిడీ చేశారని ఆరోపించారు. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుండ్లకమ్మ మ‌ర‌మ‌త్తులకు నిధులు కేటాయించిందని తెలిపారు. ఎండాకాలం పూర్తి అయ్యేలోపు కాలువ‌ పూడికతీత‌, మ‌ర‌మ‌త్తులు పూర్తి చేయాలని సాగు నీటి సంఘాల క‌మిటీ స‌భ్యులను ఆదేశించారు. వ్యవసాయం సీజన్ నాటికి పంట కాలువలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గుండ్లక‌మ్మ చుట్టు ప‌క్కల గ్రామాల ప్రజ‌ల‌తో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటామన్నారు. గుండ్లక‌మ్మ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీటిని నిల్వ చేసి 20 లక్షల చేప పిల్లలను వదిలామని చెప్పారు. జలాశయం మీద ఆధారపడి జీవించే వారికి జీవనోపాధి కలిస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు

Next Story