అదంతా డ్రామా: వైసీపీ నేతలపై మంత్రి ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-20 09:26:19  IST  )

మాజీ సీఎం జగన్‌కు భద్రత లేదనడం డ్రామా అని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు..

అదంతా డ్రామా: వైసీపీ నేతలపై మంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్‌(Former Cm Jagan)కు భద్రత లేదనడం డ్రామా అని మంత్రి బాలవీరాంజనేయస్వామి(Minister Balaveeranjaneyaswamy) అన్నారు. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ నేతలు గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌(Governor Abdul Nazir)కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్(Election Code) అందరికీ వర్తిస్తుందన్నారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని చెప్పారు. వైసీపీ నేతలు లాగా బ్లూ రాజ్యాంగం నడపడంలేదన్నారు. తాము కూడా అదే రాజ్యంగాన్ని అమలు పరిస్తే వైసీపీ నేతలు బయట అడుగుపెట్టలేరని మంత్రి బాలవీరాంజనేయస్వామి హెచ్చరించారు.

రైతుల పేరు చెప్పి మిర్చి యార్డులో రౌడీయిజం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు భద్రత పేరుతో సానుభూతి నాటకాలు ఆడుతున్నారని మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరులో బల ప్రదర్శన చేసి రైతులను ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డిని చట్టప్రకారం శిక్షించాలన్నారు. వైసీపీ కార్యకర్తల వీరంగం కారణంగా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు భద్రత పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని ఆరోపించారు. పరిపాలకుడిగా అట్టర్ ఫ్లాప్ అయిన జగన్ రెడ్డి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ ఘోరంగా విఫలమౌతున్నారని ఎద్దేవా చేశారు. నిబంధనలకు అనుగుణంగా జగన్ రెడ్డికి భద్రత ఉంది, ఆయన భద్రతను తగ్గించిందేమీ లేదని మంత్రి విమర్శించారు.

Next Story