- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ అరెస్ట్ పేరుతో అద్దంకిలో భారీ దోపిడీ
సైబర్ మోసానికి గురైన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.

దిశ ప్రతినిధి, బాపట్ల: సైబర్ మోసగాళ్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో మాయ చేసి సామాన్యులనే కాకుండా విద్యావంతులను సైతం నిలువునా దోచేస్తున్నారు. అటువంటి కేసు ఒకటి ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం అద్దంకికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నాగేశ్వర రావు సైబర్ క్రిమినల్స్ బారినపడి మోసపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సుమారు రూ.1,23,00,000 కోట్లు (కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు) సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు. ఇటీవల ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది. అందులో దుండగులు తమను తాము ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. బాధితుడి ఆధార్ కార్డు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని అదరగొట్టారు. నాగేశ్వర రావు పేరుతో తైవాన్ నుంచి డ్రగ్స్ పార్శిల్ వెళ్లాయని.. దానిపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసిందని బెదరగొట్టేశారు. దీంతో బెదిరిపోయిన ఆయన వారు అడిగినంత సొమ్ము చెల్లించి మోసానికి గురయ్యారు.
24 గంటల 'డిజిటల్ అరెస్ట్'
తమను తాము నిజమైన అధికారులుగా నమ్మించిన నేరగాళ్లు.. బాధితుడైన నాగేశ్వర రావును తన ఇంట్లోనే ఒక గదిలో ఉండాలని సూచించారు. అదే విధంగా ఎవరికీ ఫోన్ చేయకూడదని ఆజ్ఞాపించారు. ఆయన డిజిట్ అరెస్ట్ అయ్యారని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగానే ఒక గదిలో తనను తాను బంధించుకున్న బాధితుణ్ణి స్కైప్ (Skype) ద్వారా దుండగులు 24 గంటల పాటు వీడియో పర్యవేక్షణలో ఉంచారు. కేసు నుంచి బయటపడాలంటే తమ 'సెక్యూరిటీ అకౌంట్'కు డబ్బు పంపాలని, దర్యాప్తు తర్వాత తిరిగి ఇస్తామని సూచించారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని విడతల వారీగా, సుమారు రూ.1.23 కోట్లను వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. తర్వాత దుండగులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించారు. వెంటనే డయల్ 1930 ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అద్దంకి టౌన్ పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదును గురువారం స్వీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అద్దంకి సీఐ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణను చేపట్టారు.






