టీడీపీ రెబల్స్‌ను సస్పెండ్ చేయిస్తా: మాజీ మంత్రి బాలినేని వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ఒంగోలు జనసేనలో గ్రూప్ పాలిటిక్స్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమిలో రెండేళ్లులో జనసేన కార్యకర్తలకు న్యాయం జరగడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు..

టీడీపీ రెబల్స్‌ను  సస్పెండ్ చేయిస్తా: మాజీ మంత్రి బాలినేని వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు జనసేన(Ongole Janasena)లో గ్రూప్ పాలిటిక్స్‌(Group politics)పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Minister Balineni Srinivasa Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమిలో రెండేళ్లులో జనసేన కార్యకర్తలకు న్యాయం జరగడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌గా ఉన్నోళ్లకు తాను సాఫ్ట్ గానే ఉంటానని, ఎవరైనా యవ్వారం చేస్తే అది కూడా తేలుస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేనలో రెండు గ్రూపులు ఉండకూడదని చెప్పారు. గ్రూపులు కడితే కూటమి ఎమ్మెల్యేలతో ఇబ్బందులు వస్తాయన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఒకటే ఉంటే పార్టీ టికెట్లు ఇప్పించే పూచీ తనదని బాలినేని హామీ ఇచ్చారు.

రెబల్స్‌ను సస్పెండ్ చేయిస్తా...

తెలుగుదేశం పార్టీ వాళ్లు రెబల్‌గా నిలబడితే సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు. కూటమి ఎమ్మెల్యేలంతా తమకు జూనియర్లేనని చెప్పారు. జనసేనలో చేర్చుకోవద్దని కొందరు తనపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. జనసేన కార్యకర్తలపై తాను కేసులు పెట్టించానని ప్రచారం చేశారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమతోనే తాను జనసేనలో చేరానని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి తాను ఆర్థికంగా చితికిపోయానని చెప్పారు. అయితే తనను పవన్ కల్యాణ్ ఆర్థికంగా ఆదుకున్నారని బాలినేని వెల్లడించారు. ఎమ్మెల్యే టికెట్ వైఎస్ ఇచ్చారన్న అభిమానంతోనే మంత్రి పదవిని వదులుకుని గతంలో జగన్ తో కలిసి నడిచానని తెలిపారు. పార్టీలో గ్రూపులు కట్టి విమర్శించేవాళ్లు తననేం చేయలేరని మంత్రి బాలినేని ధీమా వ్యక్తం చేశారు.

Next Story