యుద్ధం ఆపేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు: కేఏ పాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-11 06:52:07  IST  )

యుద్ధం ఆపేందుకు వెళ్తుంటే తనను అడ్డుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

యుద్ధం ఆపేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు: కేఏ పాల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) యుద్ధం ఆపేందుకు తాను ఇస్తాంబుల్ దేశం టర్కీ(Turky) వెళ్తుంటే ముంబై ఎయిర్ పోర్టు(Mumbai Airport)లో తనను అడ్డుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) అన్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా తమను ఎయిర్ పోర్టులో ఆపుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ తనను ఏ దేశంలోనూ అడ్డుకోలేదన్నారు. 37 ఏళ్లుగా ప్రపంచంలోని 155 దేశాలకు వెళ్లి వస్తున్నానని పేర్కొన్నారు. మున్నా అనే అధికారి తనను అడ్డుకుంటున్నారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌పోర్టులో తమను ఆఫ్ లోడ్ చేస్తున్నారని మండిపడ్డారు. తమను అడ్డుకోమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఇది అక్రమం కాదా అని కేఏ పాల్ నిలదీశారు.

Next Story