- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగ్గన్న తోటలో నేడు ఘనంగా ప్రభల తీర్థం.. 5 లక్షల మంది భక్తుల కోసం ఏర్పాట్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో నేడు ఘనంగా ప్రభల తీర్థం వేడుక ఘనంగా జరనుంది. పలగుమ్మి నుండి తొలి ప్రభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి జగ్గన్న తోటకు ఏకాదశ రుద్రులు చేరుకోనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో నేడు ఘనంగా ప్రబల తీర్థం వేడుక ఘనంగా జరనుంది. పలగుమ్మి నుండి తొలి ప్రభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి జగ్గన్న తోటకు ఏకాదశ రుద్రులు చేరుకోనున్నారు. ఏకాదశ రుద్రులు పంట పొలాలను తొక్కుతూ దాటుకుంటూ జగ్గన్న తోటకు చేరుకుంటారు. జగ్గన్న తోట సమీపంలోని పంట పొలాలు, పంట కాలువను దాటే వేడుకను చూడడానికి ఇక్కడకు భారీగా జనాలు విచ్చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ ఏడాది దాదాపు 5లక్షల మంది భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఇది ఓ ప్రాచీన సంప్రదాయం. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు జరుపుకుంటారు. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుండి బయలుదేరి జగ్గన్నతోటలో కొలువుదీరతారని ప్రజల క్షేమం గురించి అక్కడ చర్చించుకుంటారనేది ప్రజల నమ్మకం.






