విజయవాడ దుర్గగుడికి విద్యుత్ పునరుద్ధరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-27 11:32:49  IST  )

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది..

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ పునరుద్ధరణ
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గగుడి(Vijayawada Durga Temple)కి శనివారం ఉదయం అధికారులు విద్యుత్‌(Vidyut)ను నిలిపివేశారు. దుర్గగుడి రూ. 3.08 కోట్ల బిల్లు బాకాయిలుండటంతో ఏపీసీపీడీసీఎల్(APCPDCL) ఈ చర్యలు తీసుకుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలను గుడి ఈవో కొనసాగించారు. అయితే దుర్గగుడికి విద్యుత్ నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖతో దుర్గగుడి ఈవో చర్చలు జరిపారు. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో దుర్గగుడికి విద్యుత్‌ను పునరుద్ధరణ చేశారు.

Next Story