లక్ష్యం సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-15 04:40:17  IST  )

తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు.

లక్ష్యం సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. పొట్టి శ్రీరాములు (Potti Sri Ramulu) వర్ధంతిని పురస్కరించుకొని ఆయనను సీఎం స్మరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమరజీవి పొట్టి శ్రీరాములును కీర్తిస్తూ పోస్ట్ చేశారు.

"అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు ఆయన. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు ఆయన. తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఆయన త్యాగం మనలో స్ఫూర్తి నింపాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కమారు నివాళి అర్పిస్తున్నాను."

అని సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో పొట్టి శ్రీరాములు ప్రభావితంఅయ్యారన్నారు. అంతేకాకుండా స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న ధీరోదాత్తుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సాకారం కావడానికి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎనలేనిదన్నారు. తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగువారిలో కొత్త స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. ఆయన త్యాగం భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. అటువంటి పొట్టి శ్రీరాములుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నివాళి అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Next Story