Viral Video: కత్తి తీసుకురమంటావా పరకాల..? వైరల్ గా మారిన పోతిన మహేష్ వ్యాఖ్యలు..

by Kodari Anjali |   (  Updated:2024-04-10 15:22:24  IST  )

జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు.

Viral Video: కత్తి తీసుకురమంటావా పరకాల..? వైరల్ గా మారిన పోతిన మహేష్ వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డెస్క్: జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు. ఈ రోజు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా రెండు రోజుల క్రితం పోతిన మహేష్ జనసేన కు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. గతంలో జనసేనను వీడి వేరే పార్టీ జెండాను తాను పట్టుకుంటే విజయనగరం జిల్లాలో ఏ కార్యకర్త అయినా కొబ్బరి బొండాల కత్తితో తన చెయ్యి తీసేయొచ్చని బహిరంగంగా పేర్కొన్నారు.

ఇదే మాటను పవన్ కళ్యాణ్ కి చెప్పండి ధీమా వ్యక్తం చేశారు. కాగాఆయన వైసీపీ గూటికి చేరడంతో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో మహేష్ చేసిన వ్యాఖ్యలు నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహేష్ కి పార్టీ కండువా కప్పుతున్న విజువల్స్ ను పక్కపక్కన పెట్టిన వీడియోకి కత్తి తీసుకురమంటావా పరకాల మహేష్ గారు అనే ట్యాగ్ జోడించి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

Next Story