- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Posani: పోసానిని కలిసేందుకు వైసీపీ నేతల యత్నం.. ఓబులవారిపల్లె పీఎస్ వద్ద ఉద్రిక్తత
కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై చెన్నరాజుపోడు (Chennarajapodu) మాజీ సర్పంచ్ జోగినేని మణి (Jogineni Mani) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై చెన్నరాజుపోడు (Chennarajapodu) మాజీ సర్పంచ్ జోగినేని మణి (Jogineni Mani) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారిపల్లి (Obulavaripalle)లో పీఎస్‌లో 196, 352 (2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు అయ్యాయి. అయితే, బుధవారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గం (Rayadurgam)లోని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఇవాళ ఉదయం ఓబులవారిపల్లె (Obulavaripalle) పీఎస్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే పోసానిని కలిసేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని స్టేషన్‌లోకి అసుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం పోసాని మురళీకృష్ణను రైల్వేకోడూరు (Railway Kodur) కోర్టులో హాజరుపరచనున్నారు.






