- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం.. కన్నీరుమున్నీరైన నటుడు పోసాని
నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని సీఐడీ అధికారులు(CID officials) బుధవారం గుంటూరు కోర్టు(CID Officials)లో హాజరు పరిచారు.

దిశ, వెబ్‌డెస్క్: నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని సీఐడీ అధికారులు(CID officials) బుధవారం గుంటూరు కోర్టు(CID Officials)లో హాజరు పరిచారు. జడ్జి సమక్షంలో పోసాని కృష్ణ మురళి కన్నీరు పెట్టుకున్నారు. తాను తప్పు చేస్తే నరికేయండన్న పోసాని.. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదని.. రెండు ఆపరేషన్లు, స్టంట్‌లు వేశారంటూ కోర్టులో వాపోయారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత కోపంతో తనపై ఫిర్యాదు చేశారని.. తన మీదున్న కేసులో సెక్షన్ 111 వర్తిందని అన్నారు.
మరోవైపు.. పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్(PT warrant) వేశారు. ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరు కాగా, తాజాగా సీఐడీ పోలీసుల పీటీ వారెంట్‌తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు పోసానిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మరోసారి పోసాని విడుదలపై సస్పెన్స్ నెలకొంది.
Read More..






