- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు పోసాని కృష్ణ మురళికి మరో BIG షాక్
వైసీపీ(YCP) నేత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి మరో భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) నేత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి మరో భారీ షాక్ తగిలింది. బుధవారం సీఐడీ అధికారులు ఆయన్ను జడ్జి ముందు హాజరు పరిచారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. చంద్రబాబు(Chandrababu)పై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించింది. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, రెండు సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు. బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. బెయిల్‌పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉంది.
Read More..






