కావాలనే పోలింగ్ కేంద్రాలు మార్చారు.. ఈసీపై YS అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నిక అటు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

కావాలనే పోలింగ్ కేంద్రాలు మార్చారు.. ఈసీపై YS అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నిక అటు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరో స్పష్టత వచ్చేసింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఏకంగా 11 మంది బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతా‌రెడ్డి (Mareddy Latha Reddy), వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌ రెడ్డి (Hemanth Reddy), కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి (Shiva Kalyan Reddy)తో పాటు మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సరిగ్గా పోలింగ్‌కు ముందు బూత్‌ల మార్పుతో ఎన్నికల కమిషన్ మరో కుట్టరకు తెర లేపిందని ఫైర్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల మార్పు వెనుక టీడీపీ కుట్ర కచ్చితంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించాలని, ఏ ఊరి వాళ్లు ఆ ఊళ్లోనే ఓటు వేసేలా చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను పాదర్శకంగా నిర్వహించే దమ్ముందా అని ప్రభుత్వాన్ని, ఈసీని ఆయన ప్రశ్నించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story