- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పోలీసులను వదిలపెట్టం: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం మరింత వేడెక్కింది....

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం మరింత వేడెక్కింది. ఇటీవల గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నిక తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ప్రొద్దుటూరులో రాజకీయ చిచ్చుకు దారి తీశాయి. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే వరద రాజులు రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని రాచమల్లు మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు వారికి పోలీసులు అనుకూలంగా వ్యవహరించారని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలకు వత్తాసు పలికిన పోలీసులను తాము మర్చిపోమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ పోలీసులను విధుల నుంచి తొలగిస్తామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు హెచ్చరించారు.






