- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Visakhapatnam: పేర్ల మార్పుతో ఏపీలో రాజకీయ రగడ
ఏపీలో పేర్ల మార్పుపై రాజకీయ రగడ నెలకొంది. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలకు నాయకుల పేర్లు మారుస్తూ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి

అధికారంలోకి రాగానే పాత పేరు తీసి కొత్త పేరు..
తాజాగా విశాఖ స్టేడియానికి వైఎస్సార్ పేరు తొలగింపు
ఆందోళనకు సిద్ధమైన వైసీపీ శ్రేణులు
నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన వైసీపీ
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో పేర్ల మార్పుపై రాజకీయ రగడ నెలకొంది. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలకు నాయకుల పేర్లు మారుస్తూ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చారు. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్లో నిర్ణయించారు. తాజాగా డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ (ACA VDCA Cricket Stadium)పేరులో వైఎస్సార్ పేరును తీసివేశారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విశాఖలోని స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. స్టేడియాలను ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో మొదలు..
ఏపీలో అధికారం మారినప్పుడల్లా ఆయా సంస్థల పేర్లు మారుస్తూ నిర్ణయాలు తీసుకోవటం రాజకీయ వివాదాలకు తావిస్తోంది. 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Healt University) పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఆ హెల్త్ యూనివర్సిటీ స్థాపించడానికి ముఖ్య కారకుడైన ఎన్టీఆర్ పేరును తీసివేయడం తగదని పెద్దలు కూడా చెప్పారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది.
పథకాల పేర్లు సరేసరి..
అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వ పథకాలు పేర్లు మార్చి వేయడం పరిపాటిగా మారింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్, జగనన్న పేర్లు పలు పథకాలకు పెట్టారు. విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ పేరు కూడా తీసివేసి జగన్ పేరు పెట్టుకోవడం విమర్శలకు తావిచ్చింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరును పెట్టారు. గతంలో చంద్రన్న అనే పేరును ఎక్కువగా ఉపయోగించారు. ఈ దఫా ఎన్నికల తర్వాత మూడు పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడడంతో ఆ పేరును వాడడం తగ్గించారు. పలు పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం హర్షనీయం. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు, జగనన్న ఆణిముత్యాలకు అబ్దుల్ కలాం పురస్కారం పేరు పెట్టారు. కీలకమైన ఆరోగ్య శ్రీ (Arogyasree) పథకానికి వైఎస్సార్ ను పేరును తీసివేసి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఏపీలో అధికారం మారినప్పుడల్లా పలు సంస్థలు పథకాల పేర్లు మార్చడం ఆనవాయితీగా మారింది.






