- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మహత్యకు బయల్దేరిన కుటుంబం.. దేవుడిలా వచ్చి కాపాడిన పోలీసు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్‌నాథ్ కుటుంబం అప్పుల బాధతో ప్రాణాలు తీసుకోవాలనుకుంది....

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) మాచర్ల నియోజకవర్గం(Macharala Constituency) దుర్గి(Durgi)కి చెందిన అమర్‌నాథ్ కుటుంబం(Amarnath family) అప్పుల బాధతో ప్రాణాలు తీసుకోవాలనుకుంది. అయితే పోలీసులు దైవంలా వెళ్లి వారిని కాపాడారు. ఆర్థిక ఇబ్బందులు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో అమర్‌నాథ్ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. తన భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి కారులో బయలుదేరి ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని భార్య తన పుట్టింటి వారికి మెసేజ్ ద్వారా తెలిపారు. దీంతో పుట్టింటి వారు వెంటనే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై కిషోర్, ఆయన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు.
టెక్నాలజీ సాయంతో..
టెక్నాలజీ సాయంతో కారు ఎక్కడుందో ట్రేస్ చేసి అత్యంత వేగంగా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని అడ్డుకున్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి వారిని క్షేమంగా కాపాడారు. అనంతరం వారికి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని సమయస్ఫూర్తితో కాపాడిన ఎస్సై కిషోర్(S.I. Kishore), ఇతర సిబ్బందిని ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ప్రాణాలు పోయేలోపే స్పందించి ఓ నిండు ప్రాణాన్ని, ఆ కుటుంబాన్ని నిలబెట్టిన పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు.






