- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కాపురం బస్సు ప్రమాదంపై కేసు నమోదు.. యజమాని అరెస్ట్
మార్కాపురం ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై పోలీసులు చర్యలు చేపట్టారు. బస్సు యజమాని హరికృష్ణతో పాటు డ్రైవర్ యువరాజును పోలీసులు అరెస్ట్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం ట్రావెల్స్ బస్సు ప్రమాదం(Markapuram Travels bus accident)పై పోలీసులు చర్యలు చేపట్టారు. బస్సు యజమాని హరికృష్ణ(Bus owner Harikrishna)తో పాటు డ్రైవర్ యువరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని నిందితుడిగా డ్రైవర్ యువరాజును చేర్చి 304ఏ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ధర్మాసనం వీరికి రిమాండ్ విధించే అవకాశం ఉంది.
కాగా మార్కాపురం జిల్లా(Markapuram District)లో టిప్పర్ లారీ(Tipper Lorry)ని ట్రావెల్స్ బస్సు(Travels Bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది సజీవదహనం కాగా ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఘటన జరిగిన రోజునే పోలీసులు అంచనా వేశారు. ముమ్మరంగా విచారణ జరిపి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాల్లో విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సొంత వాళ్లను కోల్పోవడంతో బాధను దిగమింగలేకపోతున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు.






