- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌ను మరోసారి అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జనసేన చీఫ్!
విజయవాడకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మొదట జగ్గయ్యపేటలోని కరిపాడు వద్ద పవన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. అక్కడ నుండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత అనుమంచిపల్లి వద్ద మరోసారి అడ్డుకున్నారు. దీంతో అనుమంచిపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేయడంతో పవన్ కల్యాణ్ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. మంగళగిరి వరకు నడుచుకుంటూ వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్తున్నారు.
Next Story






