పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి.. మాజీ మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 07:59:43  IST  )

నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలంటూ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి.. మాజీ మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలంటూ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇవాళ ఆమె నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చూసి అంతా నవ్వుతున్నారని కామెంట్ చేశారు. ఇందుకు ఏపీ పోలీసులు సిగ్గుపడాలని అన్నారు. దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీసు డిపార్ట్‌మెంట్ ఉందని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), హోంమంత్రిగా ఉన్న అనిత (Anitha) కూడా కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక చూసి సిగ్గుపడాలని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మాజీ సీఎం జగన్ రూ. 960 కోట్లతో పనులు చేపట్టితే.. ఆ పనులకు ఆపి చంద్రబాబు సర్కార్ చూస్తోందని అన్నారు. ఇంత జరగుతుంటే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు.

Read More..

13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం : సీఎం చంద్రబాబు

Next Story