- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు
by Ajay Maddhiboyina |
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కోసం తిరుపతి, బెంగుళూరు, హైదరాబాద్‌తో పాటూ విజయవాడలో పోలీసులు గాలిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కోసం తిరుపతి, బెంగుళూరు, హైదరాబాద్‌తో పాటూ విజయవాడలో పోలీసులు గాలిస్తున్నారు. మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని రాఘవరెడ్డిపై కేసు నమోదైంది. సెక్షన్లు C/NO 360/15 ,U/sec 191(2,) ,191(3),324 (4),109 r/w 190 BMS కింద రాఘవరెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపుతోనే వైసీపీ నేతలను, వారికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు కూటమి నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో అన్నదానిపైనే చర్చ జరుగుతోంది.
Next Story






