ఆర్టీసీ బస్సులో తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత

by Vemula.Srinu Prasad |

ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు చేయగా భారీగా నగదు పట్టుబడింది..

ఆర్టీసీ బస్సులో తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఏదో ఒక అవసరం, వ్యాపారం నిమిత్తం నగదు ఓ చోట నుంచి మరో ప్రాంతానికి తరలిపోతోంది. తాజాగా ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. దీంతో డబ్బు(Money) తరలింపుపై ఆరా తీశారు. ఈ విజయవాడ-నెల్లూరు ఆర్టీసీ బస్సు(RTC bus)లో జరిగింది. భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్న సమాచారంతో బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా(Tanguturu Toll Plaza) వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుడి బ్యాగును పరిశీలించారు. అందులో రూ.49.45 లక్షల నగదును గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాడేపల్లిగూడెనికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. నగదును, వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story