- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైష్ణవిది పరువు హత్య... సోదరులే హంతకులు.. అసలు స్టోరీ ఇదే..!
గండికోట బాలిక హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు..

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా జమ్మలమడుగు(Jammalamadugu) నియోజకవర్గం గండికోట(Gandikota)లో బాలిక హత్య కేసు సంచలనంగా, మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా పోలీసులు అసలు నిజాలు రాబట్టారు. వైష్ణవిది పరువు హత్య(Vaishnavite honor killing)ని, సోదరులే హంతకులు అని గుర్తించారు. ప్రేమలోపడి, కుటుంబ పరువు తీస్తోందని సోదరులు తోబుట్టువు ఉసురు తీశారని పోలీసులు తెలిపారు.
కాగా ప్రొద్దుటూరుకు చెందిన బాలిక వైష్ణవి గండికోటలో ఈ నెల15న హత్యకు గురయ్యారు. తమ కూతురు కనిపించడం లేదని ఈ నెల 14న పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే వైష్ణవి మృతదేహం.. స్థానిక రంగనాథ స్వామి ఆలయం వెనుకవైపు కనిపించింది. అయితే బైక్‌పై వైష్ణవిని లోకేశ్ అనే యువకుడు తీసుకెళ్లారు. ఆ తర్వాత లోకేశ్ అక్కడి నుంచి ఒంటరిగా వెళ్లిపోయారు. అయితే లోకేశ్‌తో ప్రేమ వ్యవహారం వైష్ణవి ఇంట్లో చాలా రోజు క్రితమే తెలుసు.
స్థానిక సీసీ టీవీ పుటేజ్ పరిశీలనలో అసలు విషయం తెలిసింది. లోకేశ్ వెళ్లిపోయిన తర్వాత వైష్ణవి పెదనాన్న కుమారుడు సురేందర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు వైష్ణవి స్కూలుకు రాకపోవడంతో తల్లిదండ్రులకు యజమాన్యం ఫోన్ చేశారు. దీంతో లోకేశ్‌తో వెళ్లిందని నిర్దారించుకున్న సురేందర్... వైష్ణవి స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకుని గండికోట రంగనాథస్వామి ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వైష్ణవితో గొడవకు దిగారు. ఆమెపై బలంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. లోకేశ్‌పై కేసు మళ్లేలా వైష్ణవి ఒంటిపై ఉన్న బట్టలను తీసి మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా వైష్ణవిని చంపింది సురేందరేనని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు.






