Nuziveedu Court:వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ డిస్మిస్

by Jakkula.Mamatha |

వైసీపీ నేత వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) కస్టడీ పిటిషన్‌పై నూజివీడు కోర్టులో (Nuziveedu Court) ఈరోజు (గురువారం) విచారణ జరిగింది.

Nuziveedu Court:వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ డిస్మిస్
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) కస్టడీ పిటిషన్‌పై నూజివీడు కోర్టులో (Nuziveedu Court) ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం.. గతంలో కస్టడీకి ఇవ్వడంతో తాజా పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ఇటీవల వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలని నూజివీడు కోర్టులో పోలీసులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Next Story