వల్లభనేని వంశీ కేసు.. కౌంటర్ దాఖలుకు పోలీసులకు ఆదేశం

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-19 09:47:35  IST  )

నకిలీ పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత(YCP Leader) వల్లభనేని వంశీ వేసిన బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

వల్లభనేని వంశీ కేసు.. కౌంటర్ దాఖలుకు పోలీసులకు ఆదేశం
X

దిశ,వెబ్‌డెస్క్: నకిలీ పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత(YCP Leader) వల్లభనేని వంశీ వేసిన బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) నకిలీ పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్(Bail Petition) పై నూజివీడు కోర్టు విచారణ జరిపింది. ఈ తరుణంలో విచారణను నూజివీడు కోర్టు( Nuzvid Court) రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి(మంగళవారం) వాయిదా వేసింది.

అయితే.. గన్నవరంలో నకిలీ పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) విజయవాడ(Vijayawada) సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పై సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు, గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office)పై దాడి చేసిన కేసు, అక్రమ మైనింగ్ కేసు, నకిలీ పట్టాల కేసులు ఉన్నాయి. ఇక, కిడ్నాప్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో ఆయన ఇప్పటికీ బెయిల్ పొందిన విషయం తెలిసిందే.

Next Story