- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రోడ్లపై అలా చేస్తే ఊరుకోం’.. యువతకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!
ఇటీవల కాలంలో చాలా మంది రోడ్లపై కేకు కట్ చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది రోడ్లపై కేకు కట్ చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఫ్రెండ్స్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు అందరూ కలిసి రోడ్లపై దర్శనమిస్తారు. ఈ తరుణంలో కేకు కటింగ్ చేస్తూ తెగ హంగమా సృష్టిస్తారు. కొందరైతే ఏకంగా రోడ్డు పైనే పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ కేకలు పెడుతుంటారు. వీరు చేసే చేష్టల వల్ల రోడ్డు పై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి(Tirupati)కి చెందిన యువతకు తాజాగా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలో ఇకపై సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బర్త్‌డే కేకు(Cake) కటింగ్, బాణసంచా కాల్చడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులు(Police) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారు పలు ప్రాంతాల పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బైరాగి పట్టెడ, ఎస్టివీనగర్, శివ జ్యోతి నగర్, సత్యనారాయణపురం, రైల్వే కాలనీ, ఉపాధ్యాయ నగర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల నిఘా ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా బాణాసంచా కాల్చిన.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్ల(Raods)పై కేక్‌లు కట్ చేసినా పోలీసులు కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.






