సిరాజ్‌కు ఒమన్, సౌదీ నుంచి డబ్బులు.. ఏడేళ్లుగా హైదరాబాద్‌లోనే మకాం

by Vemula.Srinu Prasad |

విజయనగరం ఉగ్రకుట్ర భగ్నం కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతుంది...

సిరాజ్‌కు ఒమన్, సౌదీ నుంచి డబ్బులు.. ఏడేళ్లుగా హైదరాబాద్‌లోనే మకాం
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం(Vijayanagaram) ఉగ్రకుట్ర భగ్నం కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతుంది. రెండు రోజుల కస్టడీలో భాగంగా ఇద్దరు నిందితులు సిరాజ్(Siraj), సమీర్‌‌(Sameer)ను ఎన్ఐఏ అధికారులు(NIA) అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం పోలీసు శిక్షణా కాలేజీలో వారిని ఈ రోజు సైతం ప్రశ్నిస్తున్నారు. సిరాజ్, సమీర్‌లను వేర్వురుగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇద్దరు నిందితులు కూడా విచారణకు సహకరించడంలేదు. ఉగ్రదాడులు, పేలుళ్ల ఘటనపై సిరాజ్ అసలు నోరు విప్పడం లేదు. ఏడేళ్లుగా హైదరాబాద్‌లోనే ఎందుకు మకాం వేశారన్న ప్రశ్నలపైనా సెలైంట్‌ వహించారు.

అయితే సిరాజ్, సమీర్ దేశంలో ఐదు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు అధి గుర్తించారు. విజయనగరం, హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bengaluru), ముంబై(Mumbai)లోనూ రెక్కీ నిర్వహించారు. వీరికి ఒమన్(Oman), సౌదీ(Soudi) నుంచి ఆర్థిక సాయం అందుతోందని పోలీసులు నిర్దారించారు.

Next Story