Breaking: విజయవాడలో నిషేధాజ్ఞలు.. తక్షణమే అమలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-13 13:08:10  IST  )

విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు...

Breaking: విజయవాడలో నిషేధాజ్ఞలు.. తక్షణమే అమలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)తో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు(Injunctions) విధించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు(Mlc Elections), పబ్లిక్ పరీక్షల(Public Exams) దృష్ట్యా నేటి నుంచి ఏప్రిల్ 3వరకూ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు(Vijayawada CP Rajasekhar Babu) స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం, భవానీపురం, విజయవాడ వన్ టౌన్, టూటౌన్, ఎస్.ఎస్.పురం, ఏ.ఎస్.నగర్, నున్న, గవర్నర్ పేట, సూర్యారావుపేట, కృష్ణలంక, మాచవరం, గుణదల, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కవ మంది గుమిగూడవద్దన్నారు. కర్రలే, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని తిరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాజశేఖర్ బాబు హెచ్చరించారు

Next Story