ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌లో దాచిపెట్టిన పోలీసులు.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

ప్రాణ రక్షణ కోసం ప్రేమజంట ఆశ్రయించడంతో పోలీస్ స్టేషన్‌లో పెట్టి గేట్లు మూసి వేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది....

ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌లో దాచిపెట్టిన పోలీసులు.. ఉద్రిక్తత
X

దిశ, వెడ్ డెస్క్: ప్రాణ రక్షణ కోసం ప్రేమజంట ఆశ్రయించడంతో పోలీస్ స్టేషన్‌లో పెట్టి గేట్లు మూసి వేసిన ఘటన ఏలూరు జిల్లా(Eluru District)లో జరిగింది. నూజివీడుకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరి వివాహాన్ని ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో పెద్దలకు బయపడి స్థానిక పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఠాణా వద్దకు భారీగా చేరుకున్నారు. యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో యువతి, యువకుడిని పోలీస్ స్టేషన్‌లో ఉంచి బయట గేట్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై మండిపడ్డారు. తమ కూతురుకి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా తమ కూతురిని అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇరు కుటుంబాలతో పోలీసులు చర్చిస్తున్నారు. ప్రేమజంటకు హాని కలిగించొద్దని సూచించారు.

Next Story