Ap News: ఉగ్రవాది నూర్ మహమ్మద్‌పై దేశ ద్రోహం కేసు

by Vemula.Srinu Prasad |

ఉగ్రవాది నూర్ మహమ్మద్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు..

Ap News:  ఉగ్రవాది నూర్ మహమ్మద్‌పై దేశ ద్రోహం కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాది నూర్ మహమ్మద్‌(Terrorist Noor Mohammed)పై పోలీసులు దేశద్రోహం కేసు(sedition case) నమోదు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District)లో ఉగ్రవాది నూర్ మహమ్మద్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ధర్మవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

కాగా నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారత్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వ్యాట్సప్ గ్రూపులతో పాటు పాక్ ఉగ్రవాద సంస్థల్లోనూ నూర్ మహమ్మద్ యాక్టివ్ మెంబర్ గా ఉన్నారని, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఈ మేరకు నూర్ మహమ్మద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

మరోవైపు ధర్మవరం రూరల్ మండలానికి చెందిన యువకుడు రియాజ్ తన వాట్సప్‌లో పాకిస్థాన్‌కు మద్దతుగా ఆ దేశ జెండాతో పాక్ ఇన్ఫుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నారు. నూర్ మహమ్మద్‌ను విచారిస్తున్న సమయంలో మరో యువకుడి పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అతన్ను విచారించి వదిలిపెట్టారు.

Next Story