- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ అవినాశ్ రెడ్డిపై కేసు.. కారణం తెలుసా!
by Vemula.Srinu Prasad |
కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి(Kadapa MP Avinash Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక(Pulivendula ZPTC election)ల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్(YSRCP MLC Ramesh)పై దాడి జరగడాన్ని నిరసిస్తూ ఆయన నల్లగొండువారి పల్లిలో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే ర్యాలీకి అనుమతి లేని కారణంతో పాటు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు చర్యలు చేపట్టడారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. వైసీపీ నేతలపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Next Story






