- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Former Minister Sidiri Appala Raju)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ పీఎస్(Kasibugga Police Station) దగ్గర మంగళవారం రాత్రి ఆయన ఆందోళనకు దిగారు. అదే రోజు ఉదయం కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైసీపీ(Ycp) నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ను వైసీపీ కార్యకర్త వేణుగోపాల్ నెట్టివేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అదే రోజు సాయంత్రం సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆ రోజు రాత్రి ఒంటి వరకు అక్కడే బైఠాయించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.
అయితే ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు 14 మందిపై కేసు నమోదు చేశారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






