ర్యాగింగ్ భూతంపై ఫైటింగ్.. ఆకాశంలో నుంచి నిఘా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-21 12:17:26  IST  )

రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు..

ర్యాగింగ్ భూతంపై ఫైటింగ్.. ఆకాశంలో నుంచి నిఘా
X

దిశ, వెబ్ డెైస్క్: రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. పేకాట, గంజాయిపై నిఘా పెట్టినట్లు స్కూళ్లు, కాలేజీలపై పూర్తి దృష్టి పెట్టారు. స్కూళ్లు, కాలేజీల వద్ద జరుగుతున్న ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల వద్ద డ్రోన్స్ గస్తీ కాస్తున్నాయి. ఆకాశంలో నుంచే విద్యార్థుల కదలికలను పరిశీలిస్తున్నారు. అనుమానం వస్తే ఆ ప్రాంతానికి వెంటనే పోలీసులు వెళ్లిపోతున్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ జరిగితే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా..

ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రోన్స్ ఆపరేట్ చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల వద్ద నిఘా పెట్టారు. ఎవరైనా ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు భద్రంగా ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో మోటార్ సైకిళ్లు, ఆటోల్లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్ల వద్ద దించేసమయంలో పరిసర ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ఏవైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Next Story