ఏపీ సముద్ర జలాల్లోకి బంగ్లాదేశ్ మత్య్సకారులు.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు

by Vemula.Srinu Prasad |

ఏపీ సముద్ర జలాల్లోకి చేరుకున్న బంగ్లాదేశ్ మత్య్సకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

ఏపీ సముద్ర జలాల్లోకి బంగ్లాదేశ్ మత్య్సకారులు.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సముద్ర జలాల్లోకి(AP Sea Waters) 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు(Bangladeshi fishermen) వచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల(Etcherla) తీరానికి చేరుకున్నారు. దిత్వా తుఫాన్(Ditva Cyclone) ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోని అలధాటికి బంగ్లాదేశ్ మత్య్సకారులు దారి తప్పిపోయి ఏపీ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వారిని మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గార మండలం కళింగపట్నం కోస్టల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Next Story