- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో యువతిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. పోలీసులపై సీఎం ప్రశంసలు
విశాఖలో యువతిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో గాయపడి జరిగిన ఘటనపై యువతి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్నారు. సదరు యువతికి సమాచారం అందించారు. దాంతో ఆ వ్యక్తిని బాధితురాలు పరిశీలించారు. మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదని నిర్ధారించుకున్నారు. సదరు వ్యక్తిని మానసిక ఆస్పత్రికి తరలించాలని, చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆమె కోరారు.
విశాఖ పోలీసులకు ప్రశంసలు
అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(Cm Chandrababu).. విశాఖ పోలీసుల(Visakha Police)ను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
జరిగిందిదే..?
కాగా రెండు రోజుల క్రితం విశాఖలో యువతి విజయదుర్గపై జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేశార. అంతేకాదు దుర్భాషలాడారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన పోలీసులు... ఘటనకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా, కేసును ఛేదించడంపై బాధిత యువతి సంతృప్తి వ్యక్తం చేశారు.
కేసు ఛేదన తర్వాత మరో ట్వీట్ పెట్టిన యువతి
READ MORE ....






