- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bus Accident case: శివశంకర్‌తో మరో వ్యక్తి.. విచారిస్తున్న పోలీసులు
కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ఎర్రిస్వామి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(Police) శనివారం కీలక విషయాలు రాబట్టారు. ఘటనకు కారణమైన బైకర్ శివశంకర్ వీడియోను సేకరించారు. ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంకుకు బైక్‌తో శివశంకర్ వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెనుక ఎర్రిస్వామి అనే వ్యక్తి సైతం ఉన్నారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కూడా శివశంకర్‌తో ఎర్రిస్వామి ఉన్ననట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తుగ్గలి మండలం రాంపల్లి వాసి ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘‘పెట్రోల్ బంకుకు రాకముందు ఏం జరిగింది. మందు తాగారా..?. శివశంకర్‌తో ఎందుకు ఉన్నావ్..’’ అనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
కాగా ప్రమాదానికి ముందు తెల్లవారుజామున 2.24 గంటల వరకు పెట్రోల్ బంక్‌లో బైకర్ శివశంకర్ ఉన్నారు. 2.39కి పెట్రోల్ బంక్‌ను బస్సు క్రాస్ చేసింది. ఆ తర్వాతనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.






